ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పొకిరి చాలు మరి
మోవిని మగతావిని ముడి వేయనీయవా
కాదని అనలేనని ఘడియైన ఆగవా
అదుపు పొదుపు లేని ఆనందం కావాలి
హద్దు పద్దు లేని ఆరాటం ఆపాలి || ఒంపుల ||
కాంక్ష లో కైపు నిప్పు ఎంతగా కాల్చిన
దీక్షగా ఓర్చుకున్న మోక్షమే ఉండదా
శ్వాసలో మోహ దాహం గ్రీశ్మమై వీచగా
వాంఛతో వేగు దేహం మరయాగ వాటిక
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా ..ఒఒ.. || ఒంపుల ||
నిష్ఠగా నిన్ను కోరీ నీమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే జ్వాలలూదించిన
నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెచ్చనా
సోయగం స్వంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో ఒఒ..ఒఒ.. || ఒంపుల ||
మధ్యలో కొన్ని చోట్ల సాహిత్యం తప్పుగా ఉంది.. తెలిస్తే, సరిదిద్దండి.
చిత్రం: ఏప్రిల్ ౧ విడుదల
సాహిత్యం: (సీతారామ శాస్త్రి లేక వెన్నెలకంటి .. సరిగ్గా తెలీదు .. తెలిస్తే చెప్పండి)
సంగీతం: ఇళయరాజా
గానం: బాలు, చిత్ర
దర్శకత్వం: వంశి