సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకో || 2 ||
చలేసే ఊరిలో జనాలే ఉండరా
ఎడారి దారిలో ఒయాసిస్ ఉండదా
అదోలా మూడు కాస్త మారి పోతే మూతి ముడుచుకునుంటారా
ఆటతోనో పాటతోనో మూడు మళ్లీ మార్చుకోరా
మేరా నాం జోకరు
మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాదిన్ లాంతరు
anything కోరుకో క్షణంలో హాజరు
ఖరీదేం లేదు కాని ఊరికేనె ఊపు రాదే ఓహ్ మైన
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే, చూపుతానే నా నమూనా
పిల్లి పిల్లదెప్పుడు ఒకే మాట కదా meow..
కోడి పెట్టదెప్పుడు ఒకే కూత కదా kokkokkokkorako ..
కోకిలమ్మ ఆకలైనా ట్యూన్ మాత్రం మార్చదే
రామచిలక రాతిరైన కీచూరాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వునేప్పుడు మారనియ్యకే ఏమైనా
కష్టమొస్తే, care చెయ్యక నవ్వుతో తరిమేయవమ్మ || మేరా ||
గూటిబిళ్ళ ఆడదాం సిక్సర్ కొడదాం
క్రికెట్ కాదుగాని funny గానే ఉంది
ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం
buffalos కది బాత్రూం కాదా మరి
రాణిగారి ఫోజులో నువ్వు కూరుచో మా ఠీవిగా
గేదగారి వీపు మీద షేహెర్ కెలదాం style గా
jurassic park కన్నా best place ఈ పల్లెటూరే బుల్లెమ్మ
బోలెడన్ని వింతలున్నాయ్ పోరులేక చూడవమ్మ || మేరా ||
చిత్రం: Little Soldiers
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: శ్రీ