ఆనందం ఈ బంధం
చెలి అందం సుమ గంధం
మకరందం మధుచందం
మధురగీతి చెలి కోసం
మధుమాసపు దరహాసం చెలి రూపం అనిపించేనా ?
మదిలోని భావాన్ని కవితల్లో కరిగించెనా || 2 ||
కన్నుల్లో వెన్నెల్లు కరిగించనా
మిన్నుల్లో హరివిల్లు చూపించనా
హరివిల్లు చీరల్లో బంధించనా
రంగుల్ల హంగుల్లో మురిపించనా
ఆ సందె వెలుగుల్లో తానాలే చేయించి
భువి స్వర్గం కావించే చెలి కోసం తపియించేయ్నా
మదిలోని భావాన్ని కవితల్లె వినిపించేయ్నా
పరుగెత్తే పరువంలో
అరవిచ్చే ప్రేమల్లో
నడిచొచ్చే ఊహల్లో చెలియా రూపమును చూసి
మదిలోని భావాన్ని కవితల్లో కరిగించేయ్నా...
మనసైన రాగాన్ని చెలి కోసం వినిపించేయ్నా
చెలియా నీ తలపుల్లో నను మరచినా
శ్వాసల్లు ఊసుల్లు నిలిపేయనా
కనలేని లోకాలు తరిమేయ్యనా
కనిపించే చెలినే నా లోకం అనన
ఈ బంధం నీడల్లో అనుబంధం రుచి మరిగి
ఎదలోన ఉప్పొంగే ప్రేమే చేలికందించేయ్నా
మదిలోని భావాన్ని చెలి కోసం అర్పించేయ్నా || ఆనందం ||
చిత్రం: కార్తీక్
సంగీతం: ??
సాహిత్యం: ??
Beautiful song!!!
Youtube link: http://www.youtube.com/watch?v=Xtdaa4T82zk