27, ఆగస్టు 2007, సోమవారం

"యమ దొంగ" - రివ్యూ

విడుదల అయ్యాక ఇన్ని రోజులకు రివ్యూనా అని అనకండి. నేను నిన్ననే ఈ సినిమా చూశా. అసలు రాజమౌళినేనా తీసిందీ అని చాలా సేపు ఆలోచించవలసి వచ్చింది..

NTR బావున్నాడు. ప్రియ మణి కి ఇలాంటి characters బావుంటాయి. ఆమెకు glamour పాత్రలు అస్సలు సరిపడవు. (నాకు నచ్చవు..) ఇంక మమత మోహన్ దాస్ చాలా బావుంది. సినిమా లో మాస్ కి కావాల్సినంత ఉంది కాని కథ, కథనమే బాలేవు.

కీరవాణి సంగీతం బాగుంది.. అంటే, ఒకటి రెండు ఫాటలు బాగున్నాయ్. మిగితా పాటలు మామూలు మాస్ పాటలే. ఎక్కడో విన్నట్తుగా ఉన్నాయ్.

ఇంక అసలు విషయం: సినిమాలో miss అయినది .. కథ, కథనం. కథ అంతా కలగా పులగం. కథ లో ఒక flow నాకు ఎక్కడా కనపడలేదు. ఆ యమలోకం సీన్లు, ప్రియమణి సీన్లు, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయ్ అనిపిస్తుంది. ఇంక కథలో వదిలేసిన సీన్లు చాలా. చివర్లో అలిని మమత మోహన్దాస్ బెదిరిస్తున్నట్టుగా చూపిస్తారు. తరవాత ఆ ఊసే ఉండదు. యమలోకం సీన్లు ఉన్నప్ఫూడు కొన్ని భూలోకం సీన్లు కూడా చూపించి ఉంటే బాగుండేది. కాని అలా జరగలేదు. అందుకని, యమలోకం సీన్లు, తరవాతి సీన్ల మధ్య ఎదో miss అవుతున్నట్టుగా అనిపిస్తుంది.
NTR Sr. గారు వచ్చే సన్నివేశం బాగా ఉంది కానీ, మొదటి సారి చెప్పే dialogues అన్ని lip-sync లేకుండా ఉన్నాయ్. రెండవసారి వచ్చేటప్పుడు మాత్రం బాగా వచ్చింది.

కానీ, అక్కడక్కడా సీన్లు బాగ పండాయ్. ప్రియమణి - NTR మధ్య ఇంట్లో సీన్లు, యమధర్మ రాజుగా NTR dialogues.. ఇంకా, సెట్లు చాలా బాగా వేశారు. graphics ని కూడా బాగా ఉపయోగించుకున్నారు. యమధర్మ రాజు కోట, యమలోకం సెట్, తెలుగు సినిమాలన్నింటికీ high-light. ఇవన్నీ చూస్తే, మనం కూడా ఒక animation సినిమా ఈసీగా తీసెయ్యొచ్చు అనిపించక మానదు.

మొత్తానికి, సినిమాలో "ఎందుకు, ఏమిటి, ఎలా" అన్న విషయాలు అడగకుండా పక్కన పెడితే, సినిమా సూపరో సూపరు.

2 కామెంట్‌లు:

  1. last lo cinema super ani rasaru ...so. ... no comments ....

    రిప్లయితొలగించండి
  2. సినిమా సూపర్ అంటే ఎలాగో కూడా రాశా కదండీ.. :)
    .."ఎందుకు, ఏమిటి, ఎలా" అనే ప్రశ్నలు వేయకండి చాలు.. :D

    రిప్లయితొలగించండి