పల్లవి:
ఓ.. ఓ..
పాదమెటు పోతున్నా.. పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా.. తోడురానా
చిన్ని ఎడబాటైనా.. కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా..
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడవేనా..
Oh.. my friend.. తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
oh.. my friend.. ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
ఓ.. ఓ..
చరణం: ౧
అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందీ..
జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతోందీ..
"మీరు.. మీరు" నుంచీ మన స్నేహ గీతం.. "ఏరా.. ఏరా"ల్లోకీ మారే..
మోమాటాలే లేనీ కళే జాలువారే..
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడనీవే.. || oh my friend.. ||
చరణం: ౨
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే..
నిన్ను చూస్తే చిన్న నాటీ చేతలన్నీ చెంతవాలే..
గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం..
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే..
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడనీవే.. || oh my friend.. ||
చిత్రం: హాప్పీ డేస్
సంగీతం: మిక్కీ జె మేయర్స్
గాత్రం: కార్తీక్
సాహిత్యం: వనమాలి
పాట చాలా బావుంది. సాహిత్యం వేటూరిగారా లేక వనమాలిగారా సరిగ్గా తెలియదు. మీకు తెలిస్తే, సరిచెయ్యగలరు. :)
సినిమా చాలా బాగుంది. lyrics ఇచ్చినందుకు దన్యవాదాలు....నేనూ చిత్రం చూశానండీ, పేర్లు వెసేప్పుడు ::వేటురి:: గారి పేరు వేశారండి
రిప్లయితొలగించండిఅమ్మ ఒడిలో లేని "పాశం" ......ఉండబట్టలేక చెప్పాను...ఏమీ అనుకోవద్దు.....గాయకులు అలా ఉచ్చరిస్తే తప్పే.....అసలు పదం "పాశం".....నదిచే ని "నడిచే" గా సరిదిద్దండి....కృతజ్ణతలు....
రిప్లయితొలగించండిఇలాంటిపాటలు వింటున్నప్పుడు ఒక పక్క మనసు భారమయిపోతూ,ఒక పక్క పాత జ్ఞాపకాలు నిద్రలేస్తూ......... అదో మంచి అనుభూతిలెండి.సాహిత్యం అందించినందుకు నెనర్లు.
రిప్లయితొలగించండికృతజ్ఞతలు
రిప్లయితొలగించండి@viersh గారు, నాకు ఇంకా సినిమా టిక్కెట్లు దొరకలేదండీ.. ఒక సైట్లో చూస్తే, "వేటూరి, వనమాలి" అని వేశారు. అందుకే, అలా రాశా.
రిప్లయితొలగించండి@వరహరి గారు, తప్పులు సరిదిద్దినందుకు నెనర్లు. నాకో సందేహం.. "పాశం" అనేది తమిళ పదం కదండీ.. తెలుగులో ఆ పదం వాడకం నేను చూడలేదు.
@రాధికగారు, మీరు చెప్పింది కరెక్టే. ఇలాంటి పాటలు వింటూంటే, చాలా హాయిగా ఉంటుంది.
వాయిద్యాల హోరులో కొట్టుకుపోతున్న తెలుగు సంగీతానికి కొత్తగా ఉంది మిక్కీ సంగీతం.
పాశం అనే మాటను బంధము, తాడు అనే అర్థంలో వాడతారు కదా!? అది తెలుగు మాటే (సంస్కృతం నుండి తెలుగులోకొచ్చిన) అనుకుంటా. తొడపాశం పెట్టేవారు కదా చిన్నప్పుడు:) పాయసాన్ని వాడుకలో పాశం అని అంటారు మా ఊళ్ళో!
రిప్లయితొలగించండిఆ.. "తొడపాశం".. గుర్తు వచ్చింది. :) నెనర్లు చదువరిగారు. ఇంతకీ, ఈ పాట ఎవరు రాశారో తెలియట్లేదే ?! ఎక్కడో ఒక సైట్లో చదివా. ఈ చిత్రంలో ఒక పాట మాత్రం వేటూరిగారు రాశారు.. మిగితావన్నీ వనమాలిగారు అని. ఎవరికైనా తెలిస్తే, కాస్త చెబుదురూ..
రిప్లయితొలగించండిపాశం సంస్కృతం నించి వచ్చిన పదం. "యమపాశం" అనే పదం వినే ఉంటారు... పాత తెలుగు సినెమాలలో, పాటల్లో ఈ పదం వాడడం చూడొచ్చు.
రిప్లయితొలగించండితొడపాశానికి చదువరిగారి వ్యూత్పత్తి చదివి తెగ నవ్వొచ్చింది. తొడ ఏమిటీ పాయసం ఏమిటీ ... విచిత్రంగా ఈ కేసులో పాయసం పెట్టే మాస్టార్లకు తృప్తి తినే పిలకాలకు అదొక రుచికరమైన మరపురాని అనుభూతి ;-)
రిప్లయితొలగించండిఈ పాట రాసింది వనమాలి గారు.
రిప్లయితొలగించండివనమాలి గారి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి
http://www.telugulo.com/view_news.php?id=769
నెనర్లు శ్రావణ్ గారు..
రిప్లయితొలగించండి