9, జనవరి 2011, ఆదివారం

కళకే కళ ఈ అందమూ - అమావాస్య చంద్రుడు

కళకే కళ ఈ అందమూ
ఏ కవి రాయని చేయని కావ్యము || కళ ||

నీలి కురులు పోటి పడెను మేఘమాలతో
కోల కనులు పంతాలాడే గండు మీలతో
వదనమో జలజమో నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీ శంఖమో || కళ ||

పగడములను ఓడించినవి చిగురు పెదవులు
వరుస తీరి మెరిసే పళ్ళు మల్లె పొడుగులు
చూపులో తూపులో చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు || కళ ||

తీగాలాగే ఊగే నడుము ఉండి లేనిది
దాని మీద పూవై పూచి నాభి ఉన్నది
కరములో కొమ్మలో కాళ్ళవి బోజలో
ఈ రూపం ఇలలో అపురూపము || కళ ||

Hear it online: http://www.telugu-melodies.com/music-director/ilayara/ilayaraja-hits-amavasya-chandrudu-kamal-hassan-songs/

చిత్రం: అమావాస్య చంద్రుడు
సంగీతం: ఇళయరాజా
గాత్రం: బాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి