Thursday, April 12, 2007

నిరీక్షణ - ఆకాశం ఏనాటిదో

ఈ పాట "నిరీక్షణ" సినిమా లోనిది. నాకు చాలా ఇష్టమైన పాట. జానకి గారు ఈ పాటని ఎంతో అందంగా పాడారు. వెనక ఇళయరాజా గారి సంగీతం ఉండనేఉంది. ఇంక ఆ పాట గొప్పతనం గురించి ఏమని చెప్పడం. సాహిత్యం రాజశ్రీ. ఆ సాహిత్యానికి జానకి గారి గొంతు, ఇళయరాజా గారి సంగీతం తోడు.. పాట అద్భుతం. నేను ఈ పాటని పొద్దున నుంచి ఒక వంద సార్లు వినుంట. ఐనా ఏదో మాయ ఈ పాట వైపు లాగుతుంది.. మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తుంది. వీలుంటే, మీరూ వినండి.
క్రింద ఆ పాట సాహిత్యం:

పల్లవి
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది

చరణం 1
ఏ పువ్వు ఏ తేటిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చూడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను

చరణం 2
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

సాహిత్యం telugubiz.net వారి సౌజన్యం తో.

ఈ పాటను ఈ క్రింది లంకె ద్వారా వినొచ్చు.
http://www.esnips.com/doc/1458e0c0-5742-4736-bc7b-4e8329774cb0/aakasam-eenatido

10 వ్యాఖ్యానములు:

అజ్ఞాత చెప్పారు...

avunandi naaku kuda ee pata chaala istam...
modati charanam lo.... ee puvvu ee movidhi.. anukuntanu... okasari check cheyyandi.....

ప్రదీప్ చెప్పారు...

ఊప్స్.. నేను చూసుకోనేలేదండీ. :)
సరిచేసినందుకు నెనర్లు.

నిషిగంధ చెప్పారు...

మంచి పాట గుర్తుచేశారు! అలానే చివర్లో పాట లింక్ కూడా పెట్టండి.. చక్కగా వెంటనే వినేయొచ్చు :)

అజ్ఞాత చెప్పారు...

sorry andi... nenu thappu cheppanu... modatidhe correct :(

nishigandha gaaru ikkada pata vinandi
http://www.esnips.com/doc/1458e0c0-5742-4736-bc7b-4e8329774cb0/aakasam-eenatido
sorry pradeep gaaru....

రాఘవ చెప్పారు...

బావుంది... సాహిత్యంకోసం పాటలు వినేవారంటే నాకు అదో ప్రత్యేక గౌరవం :)

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

http://www.raaga.com/channels/telugu/movie/A0000386.html

ఈ పాట ఇక్కడ కూడా వినొచ్చు నిషిగంధ గారు

ప్రదీప్ చెప్పారు...

నా బ్లాగు సందర్శించి, వ్యాఖ్యలు రాసిన అందరికీ ధన్యవాదాలు.
నిషిగంధగారు చెప్పినట్టు పాట కిందనే దానిని వినటానికి నా e-snips account లంకె ఇచ్చాను. వినండి.

నిషిగంధ చెప్పారు...

Thanks for the links Rajendra gaaru, Pradeep gaaru :)

Ravi చెప్పారు...

Excellent patandi idi.
Thank you very much.
I searhed for this song lyrics for so many months.
Thanks a lot.

ప్రదీప్ చెప్పారు...

Thanks Ravi !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి