4, మే 2007, శుక్రవారం

నీలి మేఘాలలో..

ఆ ఆ ఆ

నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి

ఏ పూర్వపుణ్యమో నీ పొందుగామారి
ఏ పూర్వపుణ్యమో నీ పొందుగామారి
అపురూపమై నిలిచే నా అంతరంగాన

నీలి

నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు
నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరిపింపజేయూ

నీలి

అందుకోజాలని ఆనందమే నీవు
అందుకోజాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు

నీలి

చిత్రం: బావా మరదళ్ళు
గానం: ఎస్ జానకి
సాహిత్యం: ఆరుద్ర
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు

సాహిత్య సౌజన్యం: www.telugubiz.net

నాకు నచ్చిన పాటలలో ఈ పాట ముందు ఉంటుంది. జానకి గారి గొంతు సరిగ్గా సరిపోయింది ఈ రాగానికి, ఈ పాటకి. ఒక ఆణిముత్యం లాంటి పాట. "నెత్తావి మాధురులు" అంటే ఎంటో అర్థం కాలేదు.. తెలిస్తే, చెప్పండి.

1 కామెంట్‌: