15, జూన్ 2007, శుక్రవారం

జీవో 610 - ప్రాంతీయత

చాలా రోజులనుంచి చూస్తున్నా.. ఊరికే 610.. 415.. అంటూంటే, ఏమిటో అనుకున్న.. ఈ రోజు పేపర్ చదివితే తెలుస్తుంది.. ఐనా ప్రాంతీయత.. ప్రాంతీయత అంటారే, మనమంతా ఆంధ్రులమే కదా..
ఎదో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళా ? అంతా మన వాళ్ళే కదా.. పోనీ కనీసం వేరే రాష్ట్రం వాళ్ళా అంటే అదీ కాదు.
మరి ఎందుకు ఈ విభజన ? అసలు ఈ జీవో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ?

ఈ రోజు మళ్ళీ "ఆయన" తన ప్రాంతం లో వేరే ప్రాంతం వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు అని ప్రశ్న..
ఏంటిది ? ఎక్కడైనా చదువుకునే అర్హత కూడా లేదా ? దానికి కూడా ప్రాంతీయత అనే tag తగిలించాలా ?

6, జూన్ 2007, బుధవారం

రక్షణ - నీకు నాకు ఉన్న లింకు

నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను
యాడనో చెప్పలేను రా
గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిలినోడ పోకిరీ పోరగాడ
జల్దినా జంటకూడరా
సంజైతలే నీ సంగతేందో
ఏ సందులో నీవుందువో మల్ల.. దెల్వలే..
హా హా..

బేకారుగానే [] ఎక్కెక్కి []ఉన్నా
[]దియ్యనా ఇంత ఇస్కి బొయ్యనా
ఏ పోరగాన్తో ఈ సరుకంతా ఊకేనె ఇస్తనన్నా
ఇష్టమాయెనా ఇట్టే []బాయెనా
ఏమాయే నా పుంజు ఎటుబాయే
[]డాయే కోడెగాడు రాడాయే
ఎన్నాళ్ళిలా ఈ కన్నె జర్నీ అందాలిలా ఉండాలె యెండాలె దెల్వలే
హా హా..

ఆ పోరి ఎన్కే జారేవన్కో ఎన్కెన్క రాలేనా
ఊరుకుందునా పత్తా పట్టకుందునా
చేజారగానే బేజారయ్యే మామూలు లడ్కీనా
చేరకుందునా సత్తా చూపకుందునా
ఇయ్యాలో గల్లి గల్లి గాలిస్తా
ఎన్కాలే లొల్లి లొల్లి చేసేస్తా
చిరెత్తదా సింగారమంతా
చీకట్లకే సోకిచ్చుకోవాల దెల్వలే
హా హా..

చిత్రం: రక్షణ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: ఎమ్ ఎమ్ కీరవాణి
గానం: మాల్గాడి శుభ

ఇది ఒక item song రక్షణ సినిమాలో. ఇప్పటి సాహిత్యంలా కాకుండా item songs కి కూడా మంచి సాహిత్యం అందించారు మన సిరివెన్నెల గారు. ఈ పాటలో ఆమె (సిల్క్ స్మిత) యొక్క గడుసుతనాన్ని అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించకుండా చక్కగా రాసారు. అదే ఇప్పట్లో ఐతే, పాట మొత్తం బూతులమయం అయిపోయేది. :)
ఈ పాట కూడా చూడటానికి కొంచెం కష్టంగానే ఉందనుకోండీ..
దీంట్లో మొదటి చరణంలో చాలా పదాలు నాకు అస్సలు అర్థం అవ్వలేదు. అలాంటివన్నీ [] లో పెట్టా.
నాకు తెలంగాణాయాసతో అంత పరిచయం లేదు. ఎవరికైనా ఆ పదాలు తెలిస్తే చెప్పండి.
ఈ పాటను ఈ కింద ఇచ్చిన లంకెలో వెళ్ళి వినవచ్చు.

http://musicmazaa.com/telugu/audiosongs/movie/Rakshana.html