చాలా రోజులనుంచి చూస్తున్నా.. ఊరికే 610.. 415.. అంటూంటే, ఏమిటో అనుకున్న.. ఈ రోజు పేపర్ చదివితే తెలుస్తుంది.. ఐనా ప్రాంతీయత.. ప్రాంతీయత అంటారే, మనమంతా ఆంధ్రులమే కదా..
ఎదో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళా ? అంతా మన వాళ్ళే కదా.. పోనీ కనీసం వేరే రాష్ట్రం వాళ్ళా అంటే అదీ కాదు.
మరి ఎందుకు ఈ విభజన ? అసలు ఈ జీవో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ?
ఈ రోజు మళ్ళీ "ఆయన" తన ప్రాంతం లో వేరే ప్రాంతం వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు అని ప్రశ్న..
ఏంటిది ? ఎక్కడైనా చదువుకునే అర్హత కూడా లేదా ? దానికి కూడా ప్రాంతీయత అనే tag తగిలించాలా ?
అసలు ఈ జీవో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ?
రిప్లయితొలగించండిThis is a good question!
Probably you can read little more (as you have read in today's new paper about his 610) about the history of this GO and write another BLOG entry;
అసలీ గొడవేంటో నాకేం అర్ధం కావటంలేదు. ఎవరైనా తెవికీలో దీనిమీద వ్యాసం రాయవచ్చు కదా!
రిప్లయితొలగించండిఈ నాయకుల కొడుకులు, కూతుళ్ళు మాత్రం అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలి, కాని సొంత రాష్ట్రం లో ఒక ప్రాంతం వాళ్ళు వేరే ప్రాంతం లో ఉద్యోగం చెయ్యకూడదంట. దగుల్భాజీ రాజకీయాలు,రాజకీయ నాయకులు.
రిప్లయితొలగించండి-నేనుసైతం
నేను సైతం గారి వ్యాఖ్య చక్కగా ఉంది. ఈ ధోరణిని నిరశించాలి.ఇలా ప్రతివారూ విభజన రేఖలు గీసుకుంటూ పోతే ఇక "మనం" అనే మాటకి అర్ధమే లేదు.మరీ ముఖ్యంగా సుమారు 20-30 ఏళ్ళ జీవిత కాలాన్ని ఒక ప్రాంతంలో గడిపి అక్కడి జీవన విధానంలో కలసిపోయి,అక్కడి కాలమాన పరిస్థితులతో పాటుగా తమ జీవితాలను మలుచుకున్నవారిని ఈ క్షణంలో వెళ్ళిపోమనడం సమంజసమేనా.
రిప్లయితొలగించండి@నేను సైతం కరెక్టుగా చెప్పారు.
రిప్లయితొలగించండిఇలా విభజించుకుంటూ పోతే ఎలా ?