నా జీవితంలో నేను చేసిన మొదటి మంచి పని, "గ్రహణం" సినిమా చూడటం. ఆ సినిమాని ఎన్నాళ్ళనుంచో చూద్దాం.. చూద్దాం అని
అనుకునీ, అనుకునీ, నిన్న బెంగళూరు ఫోరంకి వెళ్ళినప్పుడు "గ్రహణం" సిడి పట్టుకొచ్చా. నిన్న రాత్రి ఆ సినిమా చూశా. ఇంత అందమైన సినిమా నేను తెలుగులో ఇంతవరకూ చూడలేదు. అప్పుడెప్పుడో హిందీ సినిమా ఒకటి, జయ భాధురి, సంజీవ్ కుమార్
నటించిన "కోషిష్" సినిమా చూసినప్పుడు కలిగిన ఫీల్ నాకు ఈ సినిమా చూసాక కలిగింది.
ముందుగా, ఆ కోషిష్ సినిమా గురించి: అందులో హీరో, హీరోయిన్లు చెవిటి, మూగవాళ్ళు. ఇద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకుంటారు. వారి సంసారం ఎలా ఉంటుంది, చివరికి ఏం అవుతుంది అనేదే ఈ సినిమా. వారికి మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ చెవిటి, మూగ కాకూడదు అని వాళ్ళు పడే ఆవేదన, దాన్ని నటించిన వైనం.. ఇవన్ని చూస్తేనే తెలుస్తాయ్. వీలుంటే, సీడీ కొనుక్కుని,ఈ సినిమా చూడండి.
తరవాత, గ్రహణం గురించి. ఈ సినిమా నన్ను చాలా ఆలోచింపజేసింది.జయలలిత నాకు అదేదో సినిమాలో "సభకు నమస్కారం"
అనే కారెక్టరు, కొన్ని వాంప్ పాత్రలతోనే గుర్తు. ఆవిడ ఇంత బాగా నటించగలరని నాకు తెలియదు.
అసలు, ఈ సినిమా దర్శకుడిని, ఛాయాగ్రాహకుడిని, నటీనటులందరినీ మెచ్చుకోవాలి. ఫాక్షన్, "నవవసంతం" లాంటి పాత చింతకాయ సినిమాలు చూసీ, చూసీ, విసిగి వేసారిన సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇలాంటి సినిమాలు ఎంతో అవసరం.
ఈ చిత్రంలో నాకు నచ్చిన ఇంకో పాయింటు, దీని ఛాయాగ్రహణం. మొత్తం నలుపు-తెలుపులో తీసి, చాలా మంచి పని చేశారు. చివర్లో, ఆ డాక్టర్ కనే కలలు మాత్రం కలర్‌లో తీసి సినిమాని చాలా అందంగా చేశారు. మొత్తానికి, చెప్పొచ్చేదేంటంటే, ఇలాంటి సినిమాలు తెలుగు పరిశ్రమలో చాలా రావాలి. అంతకంటే ముందు, "నవవసంతం" లాంటి సినిమాలను బాన్ చెయ్యాలి.
పోయిన వారం నేను "నవవసంతం" సినిమాకు వెళ్ళింటి. ఆ సినిమా ఎందుకు చూశానా అని నన్ను నేను, నన్ను తీసుకెళ్ళిన మా మిత్రుడిని తిట్టుకోని క్షణం లేదు. :( ఇప్పుడు, ఆ సినిమా యాడ్ వస్తే కూడా.. ఆ సీన్లు గుర్తు వచ్చి, వెన్నులో చలి పుట్టుకొస్తుంది. కేవలం "నవ" కోసం తీసే సినిమాలు ఇంకొసారి చూడకూడదు అని నిర్ణయించుకున్నాక చూసిన మొదటి సినిమా "గ్రహణం".
నేను కూడ చూసాను ఈ రెండు సినిమాలు(కోషిష్,గ్రహణం).మీరు జక్మ్ సినిమా కూడ చూడండి,అంటే వీటంత కాకపోయినా అది కూడా చెప్పుకోదగ్గ సినిమా.
రిప్లయితొలగించండిక్రాంతిగారు,
రిప్లయితొలగించండినేను కూడా చూశానండీ "జఖ్మ్" సినిమా. అది కూడా చాలా మంచి సినిమా. అందులో అజయ్ దేవ్‌గణ్ నటన మరచిపోగలమా !!??
Hi.. Mee abhiruchi.. meeru vyakta parichee bavaram lo nee telustundhi.. its looks my taste..
రిప్లయితొలగించండిplease can you send Grahanam link..
"గ్రహణం" లంకె నా దెగ్గర లేదు. నేను ఆ CD కొన్న. కొని, చూసిన సినిమా అది.
రిప్లయితొలగించండి