28, నవంబర్ 2007, బుధవారం

గీత - నీ కోసం

పల్లవి:

నీ కోసం నేనున్నానంటూ
నీ వెంటే కడదాకా ఉంటూ
నడిపించే అనుబంధమై రానా
నీ గుండె సవ్వళ్ళే వింటూ
నీ తోటి నీ కలనే కంటూ
నీ కంటి కనుపాపనే కానా
మదిలో దాచుకోనా
పదిలం చేసుకోనా
వరమైన ఈ బంధమే... ॥ నీ కోసం ॥

చరణం ౧:

కలత చెందిన కనులు తుడిచిన చెలిమి నేనవ్వనా
పెదవి పంచిన తపన పెంచిన చెలిని నేనవ్వనా
జోలపాడి లాలించీ నీ అమ్మలా మారనా
వెచ్చనైన కౌగిలిలో ఓ పాపలా ఒదగనా
చూపునీవై, పదము నేనై, కలిసి అడుగేయనా... ॥ నీ కోసం ॥

చరణం ౨:

It takes a second to say I love you,
but a lifetime to show it.

ఏడు అడుగులు, మూడు ముళ్ళుగా మనము జత కలిసినా
రెండు మనసులె ఒకటి చేసిన ప్రేమనే సాక్షిగా
ఏడు జన్మలే ఐనా నీ తోడుగా నడవనా
మూడు ముళ్ళనే మించే అనుబంధమై అల్లనా
మరణమైనా గెలవలేని మనువు మనదేనులే... ॥ నీ కోసం ॥

చిత్రం: గీత
సంగీతం: సునిల్ కాష్యప్
గానం: చిత్ర

ఈ పాట వినటానికి ఈ లంకె గుండా వెళ్ళండి:
http://www.raaga.com/channels/telugu/movie/A0001211.html

ఇప్పట్లో వచ్చిన పాటలన్నింటిలోకి నాకు ఈ పాట నచ్చింది.
ఎక్కడైనా దొరికితే, వినండి. రాసింది ఎవరో తెలిస్తే, ఇంకా బావుంటుంది.
మంచి సాహిత్యం, మంచి బాణీ, మంచి గాత్రం.

ఇప్పుడు మీరు ఈ పాటను నా e-snips ద్వారా వినొచ్చు. పక్కన ఉన్న e-snips ప్లేయర్‌లో పాటను వినొచ్చు. లేదా కింద ఉన్న e-snips బట్టన్‌ను నొక్కడం ద్వారా నా e-snips అకౌంట్‌లో ఆ పాటను వినొచ్చు. :)