12, ఏప్రిల్ 2007, గురువారం

నిరీక్షణ - ఆకాశం ఏనాటిదో

ఈ పాట "నిరీక్షణ" సినిమా లోనిది. నాకు చాలా ఇష్టమైన పాట. జానకి గారు ఈ పాటని ఎంతో అందంగా పాడారు. వెనక ఇళయరాజా గారి సంగీతం ఉండనేఉంది. ఇంక ఆ పాట గొప్పతనం గురించి ఏమని చెప్పడం. సాహిత్యం రాజశ్రీ. ఆ సాహిత్యానికి జానకి గారి గొంతు, ఇళయరాజా గారి సంగీతం తోడు.. పాట అద్భుతం. నేను ఈ పాటని పొద్దున నుంచి ఒక వంద సార్లు వినుంట. ఐనా ఏదో మాయ ఈ పాట వైపు లాగుతుంది.. మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తుంది. వీలుంటే, మీరూ వినండి.
క్రింద ఆ పాట సాహిత్యం:

పల్లవి
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది

చరణం 1
ఏ పువ్వు ఏ తేటిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చూడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను

చరణం 2
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

సాహిత్యం telugubiz.net వారి సౌజన్యం తో.

ఈ పాటను ఈ క్రింది లంకె ద్వారా వినొచ్చు.
http://www.esnips.com/doc/1458e0c0-5742-4736-bc7b-4e8329774cb0/aakasam-eenatido

10 కామెంట్‌లు:

  1. avunandi naaku kuda ee pata chaala istam...
    modati charanam lo.... ee puvvu ee movidhi.. anukuntanu... okasari check cheyyandi.....

    రిప్లయితొలగించండి
  2. ఊప్స్.. నేను చూసుకోనేలేదండీ. :)
    సరిచేసినందుకు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  3. మంచి పాట గుర్తుచేశారు! అలానే చివర్లో పాట లింక్ కూడా పెట్టండి.. చక్కగా వెంటనే వినేయొచ్చు :)

    రిప్లయితొలగించండి
  4. sorry andi... nenu thappu cheppanu... modatidhe correct :(

    nishigandha gaaru ikkada pata vinandi
    http://www.esnips.com/doc/1458e0c0-5742-4736-bc7b-4e8329774cb0/aakasam-eenatido
    sorry pradeep gaaru....

    రిప్లయితొలగించండి
  5. బావుంది... సాహిత్యంకోసం పాటలు వినేవారంటే నాకు అదో ప్రత్యేక గౌరవం :)

    రిప్లయితొలగించండి
  6. http://www.raaga.com/channels/telugu/movie/A0000386.html

    ఈ పాట ఇక్కడ కూడా వినొచ్చు నిషిగంధ గారు

    రిప్లయితొలగించండి
  7. నా బ్లాగు సందర్శించి, వ్యాఖ్యలు రాసిన అందరికీ ధన్యవాదాలు.
    నిషిగంధగారు చెప్పినట్టు పాట కిందనే దానిని వినటానికి నా e-snips account లంకె ఇచ్చాను. వినండి.

    రిప్లయితొలగించండి
  8. Excellent patandi idi.
    Thank you very much.
    I searhed for this song lyrics for so many months.
    Thanks a lot.

    రిప్లయితొలగించండి