12, అక్టోబర్ 2007, శుక్రవారం

హాప్పీ డేస్ - అరెరే..

పల్లవి

నీ కోసం దిగిరానా
నేనెవరో మరిచానా
నీవల్లే కదిలానా
నీవల్లే కరిగానా
నాకోసం నేన్లేనా
నా సొంతం నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా
కాదన్నా వింటేనా

అరెరే.. అరెరే..
మనసే జారె.. ॥ ౨ ॥
వరసే మారే..
ఇది వరకెపుడూ లేదే
ఇది నా మనసే కాదే
ఎవరేమన్నా వినదే
తనదారేదో తనదే

అంతా నీ మాయలోనె
రోజూ నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీ వల్లనే.. ॥ ౨ ॥

చరణం ౧

స్నేహమేరా జీవితం అనుకున్నా
ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా
ఇక సెకనుకెన్ని నిమిషాలో
అనుకుంటు రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాలా.. చాల్లే.. నీ గోలా.. ॥ అంతా ॥

చరణం ౨

చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే,
చెంత చేరి, చిత్రమే చూస్తున్నా..
చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా..
తెలుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటులేని పరవశమా, వరమా, హాయ్ రామా.. ॥ అరెరే ॥


చిత్రం: హాప్పీ డేస్
సంగీతం: మిక్కీ జె మేయర్స్
గాత్రం: కార్తీక్
సాహిత్యం: వేటూరి / వనమాలి

2 కామెంట్‌లు: