17, డిసెంబర్ 2007, సోమవారం

వాన - ఎదుట నిలిచింది

పల్లవి:
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచి పొయా మాయలో
ప్రాణమంతా మీటుతుందే వాన వీణలా... ॥ ఎదుట నిలిచింది.. ॥

చరణం ౧:
నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా... ॥ ఎదుట నిలిచింది చూడు ॥

చరణం ౨:
నిన్నె చేరుకోలేకా ఎటెళ్ళిందొ నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామ
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా... ॥ ఎదుట నిలిచింది చూడు ॥

చిత్రం: వాన
సంగీతం: మనో మూర్తి (పల్లవి మాత్రం(కన్నడ)), కమలాకర్ (మిగితా పాట)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కార్తిక్

కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన "ముంగారు మళై" చిత్రంను తెలుగులో "వాన" పేరుతో తీస్తున్నారు.
ఆ సినిమాలో అంతే పెద్ద హిట్ అయిన పాటను తెలుగులో కాపీ కొట్టారు. పల్లవి వరకు మాత్రమే లెండి. నాకు కన్నడంలో చాలా నచిన పాట. తెలుగులో కూడా చాలా బావుంది. చరణానికి సంగీతం మాత్రం మార్చారు. కన్నడంలో, తెలుగులో రెండిట్లో పాట సూపరో సూపరు. పొద్దున నుంచీ వింటున్న. అయినా విసుగు కలగలేదు. :)

Update: ఇప్పుడు ఈ పాటను నా e-snips player ద్వారా వినొచ్చు.

4 కామెంట్‌లు:

  1. Just mee Tappa chusi Song Vinnaa.. Its really nice song andi..

    రిప్లయితొలగించండి
  2. నెనర్లు రావుగారు. :)
    మీరు ఈ పాటను ఈ కింది లంకె నుండి కూడా వినొచ్చు.
    http://musicmazaa.com/telugu/audiosongs/movie/Vaana.html

    రిప్లయితొలగించండి
  3. పల్లవి మొదటి లైనులో "వెన్నెలేవో" అని రాశారు. అది "వెన్నెలేమో" అని ఉండాలి.
    నాలుగవ లైనులో "మీటుకుందే" బదులుగా "మీటుతుందే" అని ఉండాలేమో.

    ఇక రెండో చరణంలో అన్ని లైన్లకి అంత్యప్రాసలో దీర్ఘం ఇచ్చారు. పాడేప్పుడు రాగంలో దీర్ఘం తీసినా రాతలో ఆ దీర్ఘం ఉండదు."నిన్నె చేరుకోలేకా ఎటెళ్ళిందొ నా లేఖా "-ఈ వాక్యం, చివర్లో దీర్ఘం రావడం వల్ల ఎంత కృతకంగా ఉందో మీరే చూడండి.సిరివెన్నెల ఇలా రాసి ఉండడు అనుకున్నా.పాట విన్నాక నిజమే అలా రాయలేదు అనిపించింది.

    రిప్లయితొలగించండి
  4. హెలో Anonymousగారు, నేను పాట విని ఎలా పాడారో అలా రాశా. మిగితాది ఆలోచించలేదు. ఎత్తి చూపినందుకు నెనర్లు. మీరు చెప్పినట్టు సరిదిద్దాను.
    కృతజ్ఞతలు. :)
    నాకో సందేహం.. పల్లవిలో "ప్రాణమంతా మీటుతుందే" అని ఉండాలా లేక "ప్రాణమంత మీటుతుందే" అని ఉండాలా ? నేను మొదటిదే సరైనది అనుకుంటున్న. ఏమంటారు ?

    రిప్లయితొలగించండి