9, మే 2007, బుధవారం

మనీ - చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ..

పల్లవి

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు ఐన అన్ని అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బునె లబుడబ్బని గుండెల్లొ పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా

చరణం 1

ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లొ
దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లొ చిమ్మ చీకట్లో
అందుకే పద బ్రదర్ మనీ వేటకి
అప్పుకే పద బ్రదర్ ప్రతీ పూటకి
రోటి కపడ రూము అన్ని రూపీ రూపాలే
సొమ్మునె శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా

చరణం 2

ప్రేమించు కోవొచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమా గా డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్క్ లో కనే కలే ఖరీదైనది బ్లాకు లో కొనె వెలే సినీ ప్రేమది
చూపించరు గా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా

డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా

సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: బాలు

సాహిత్య సౌజన్యం: www.telugubiz.net

నాకు మామూలుగా తెలుగు పాటలలో ఇంగ్లీషు వినిపిస్తే, చిరాకేస్తుంది.. కానీ, ఈ పాట మాత్రం మినహాయింపు. :) "డ్రీమించుకోవచ్చు", "లవ్వాడటం" ఇలాంటి పదాలు సీతారామ శాస్త్రి గారు బాగా వాడుకున్నారు.. ఐనా బాగుంది. దీనికి శ్రీ సంగీతం. ఆయన మంచి music sense పెట్టుకుని ఎందుకు తక్కువగా సినిమాలు చేస్తారో నాకు అర్థం కావట్లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి