10, మే 2007, గురువారం

రంగుల రాట్నం - నడి రేయి ఏ జాము లో...

నడి రేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాల నే నడువలేను
ఏ పాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా... ఆ...
మముగన్న మాయమ్మ అలివేలు మంగ
ఆ..
మముగన్న మాయమ్మ అలివేలు మంగ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

కలవారినే గాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీట బ్రతుకున కనలేని నాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
అడగవె మా తల్లి అనురాగవల్లి
అడగవె మాయమ్మ అలివేలు మంగ

చిత్రం: రంగుల రాట్నం
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
గానం: ఘంటసాల,ఎస్ జానకి
సాహిత్యం: దాశరథి

ఈ పాట chimatamusic.com లో నుండి వినవచ్చు.

4 కామెంట్‌లు:

  1. ఘంటసాలతో గొంతు కలిపింది జానకి, సుశీల కాదు. జానకి తొలి పాటల్లో ఒకటి ఇది.
    అసలే ఘంటసాల వేంకటేశ్వరుని పరమభక్తుడు. భక్తి, కరుణ, చిప్పిల్లుతుంటాయి ఈ పాటలో.
    అయ్యవారు వినిపించుకోకపోతే అమ్మవారి రికమెండేషను అడగటం కొత్త కాదు - భజనసాంప్రదాయానికి ఆద్యుడైన రామదాసు "ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అని మొదలెట్టి, ఆ రికమెండేషను ఎప్పుడు ఎలా చెయ్యాలో కూడా చెప్పాడు - "ప్రక్కను జేరి, చెక్కిలి నొక్కుచు, చక్కగ మరుకేళి సొక్కి యుండేడు వేళ" అట్లాంటి వేళ సీతవంటి భార్యామణి అడిగితే రాముడు ఎంత కఠినుడైనా ఆమోదించకుండ ఉండలేడు కదా?

    ఇదే భావనావీధిలో మరో అడుగు ముందుకు వేసి, అలమేల్మంగా శ్రీనివాసుల గాథని గుర్తుంచుకుని, సందర్భోచితంగా తీర్చాడు కవి ఈ పాటని. అమ్మా .. అని ఆలపించే స్వరం విన్నప్పుడు గుండె ఒక్క క్షణం చిక్కబడుతుంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి.
    మంచి పాట గుర్తు చేసినందుకు థాంకులు.

    రిప్లయితొలగించండి
  2. నేను వేరే పాట వింటూ సుశీల గారు అని రాసేసా. పాట మళ్ళి వింటే జానకి గారి గొంతు గుర్తు పట్టా.. ఘంటసాల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరన్నట్టు "అమ్మా" అని ఆయన గుండెల్లో నుంచి వస్తున్నట్లు ఉంది..

    రిప్లయితొలగించండి
  3. ఈ పాట వ్రాసినవారు 'దాశరథి'.
    --శ్రీధర

    రిప్లయితొలగించండి