दिन ढल जाये हाय..
रात न जाये..
तू तॊ न आये तेरि याद सताये..
प्यार मे जिनके सब जग चॊडा और हुये बदनाम
उनके ही हाथॊ हाल हुआ ये बैठॆ है दिल कॊ थाम
अपनॆ कभी थे अब है पराये.. ॥ दिन ॥
ऐसि हि रिमझिम ऐसी पुहारॆ ऐसि हि थी बर्सात
खुद से जुदा और जग से पराये हम दोनो थे साथ
फिर से वो सावन अब क्यो न आये.. ॥ दिन ॥
दिल के मेरे पास हो इतनॆ फिर भी हॊ कितनी दूर
तुम मुझसॆ मै दिल सॆ परॆशान दोनो है मज्बूर
ऐसे मे किस्कॊ कौन मनाये.. ॥ दिन ॥
चित्र: गाइड
गीतकार: शैलेंद्र
संगीतकार: एस डी बर्मन
गायक: मोहम्मद रफी
రఫి పాడిన పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట. అసలు ఈ చిత్రం లో పాటలన్నీ బావుంటాయ్. ఇందులో శైలేంద్ర ఎంత చక్కగా చిన్న పదాలతో మంచి అర్థం వచ్చేట్టుగా రాసారో.
పల్లవి లో అంటారూ.. పగలు వెళ్ళిపోతుంది, రాత్రి గడవడం కష్టంగా ఉంది.. నువ్వు రాలేదు కానీ, నీ జ్ఞాపకాలు మాత్రం సతాయిస్తున్నాయి.
మొదటి చరణం: ఎవరి ప్రేమ కోసమైతే నేను ఈ ప్రపంచాన్నే వదిలేసి, notorious అయ్యానో వాళ్ళ వల్లనే నాకు ఈ గతి పట్టింది. ఒకప్పడు నా వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పరాయి వాళ్ళైపోయారు.
రెండవ చరణం: నేను ఆమెతో ఉన్నప్పుడు ఇలానే చినుకులు కురిసాయి.. ఇలానే వర్షం పడింది. నన్ను నేను మరచి, ఈ ప్రపంచానికి అంతటికీ మేము పరాయి వాళ్ళలాగా కలిసి ఉంటిమి. ఇప్పుడు అలాంటి వర్షం పడదే ??
మూడవ చరణం: నువ్వు నా మనసుకి ఇంత దెగ్గరగా ఉండి, ఎందుకు దూరంగా ఉన్నావ్ ? నువ్వు నా వల్ల, నేను నా మనసు వల్ల చాలా కష్టాలు పడుతున్నా కూడా ఎమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాము. ఇలాంటప్పుడు ఎవరు ఎవరిని ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు.
సినిమా లో ఇది ఒక విరహ గీతం. దేవానంద్ మీద ఈ పాట. ఆయన అలా వెన్నెల లో కూర్చుని పాడుతూ ఉంటారు.
చాలా మంచి పాట. వీలు ఉంటే, కచ్చితంగా వినాల్సిన పాట. :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి